Sponsered By:

Friday, December 10, 2010

జట్టును గెలిపించడమే నా లక్ష్యం: వీవీఎస్ లక్ష్మణ్

FILE
తన కంటూ ప్రత్యేకించి లక్ష్యాలంటూ లేవని, జట్టును గెలిపించడమే తన ప్రధాన కర్తవ్యమని ఆపద్భాంధవుడు, హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడాన్ని ఇష్టపడతానని లక్ష్మణ్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌ను టీమ్ ఇండియా ఛాలెంజింగ్‌గా తీసుకుంటుందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. 

ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. స్టెయిన్, మోర్కెల్‌ల ఫాస్ట్ బౌలింగ్, కల్లీస్ ఆల్‌రౌండర్‌గా రాణించడం భారత్‌కు బలపరీక్షేనని లక్ష్మణ్ చెప్పాడు. కానీ ఇటీవల కాలంలో భారత్ విదేశీ గడ్డపై అద్భుతంగా రాణిస్తోంది. ఇదే తీరు దక్షిణాఫ్రికాలోనూ కొనసాగుతుందని నమ్ముతున్నానని లక్ష్మణ్ అన్నాడు.భారత్ బౌలింగ్‌కు అనుకూలించని పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు పనికివస్తాయని లక్ష్మణ్ తెలిపాడు. తమ జట్టులో అద్భుతంగా రాణించే బౌలర్లు ఉన్నారని వీవీఎస్ గుర్తు చేశాడు. కానీ టీమ్ ఇండియాలోని ఆటగాళ్లు సూపర్ ఇన్నింగ్స్ ఆడితే తప్పకుండా దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గడం సాధ్యమేనని వీవీఎస్ అఅన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగుల ఆధిక్యం సాధించాలని లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

హాంకాంగ్ ఓపెన్ సిరీస్: సెమీఫైనల్లో సైనా నెహ్వాల్!

హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది. హాంకాంగ్ విజయంతో సీజన్‌కు ముగింపు పలకాలన్న లక్ష్యంతో ఈ టోర్నీ బరిలోకి దిగిన వరల్డ్ నెంబర్ టూ సైనా నెహ్వాల్, హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో తన హవాను కొనసాగిస్తోంది. 

క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిని మట్టికరిపించిన సైనా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్లో సైనా 21-11, 21- 10తో స్థానిక స్టార్ షట్లర్ పూ ఇన్ ఇప్‌పై నెగ్గి ఆసియాడ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

ఆద్యంతం మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన సైనా నెహ్వాల్ కేవలం 27 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. కాగా ఫైనల్ బెర్త్ కోసం సైనా జర్మనీ షట్లర్, ఆరోసీడ్ జులియన్ షెంక్‌తో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. ఒకవేళ జులియన్‌ను ఓడిస్తే టైటిల్‌పోరులో సైనా చైనాకు చెందిన టాప్‌సీడ్ గ్జిన్ వాంగ్ లేదా మూడోసీడ్ షిజియాన్ వాంగ్‌తో పోటీపడాల్సి ఉంటుంది.

గ్రహీత లేకుండా పురస్కారం: జియాబో ఫోటోకి నోబెల్‌

చైనాలోని ఓస్లా నగరంలో జరిగిన నోబెల్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం చూపరులన ముక్కున వేలేసుకునేలా చేసింది. మానవ హక్కుల కోసం ఉద్యమాలను నడిపిన అసమ్మతి నాయకుడు లియు జియాబొకి ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాకరమైన నోబెల్‌ శాంతి పురస్కారం లభించినప్పటికీ, ఆ పురస్కారాన్ని అందుకునేందుకు ఆయనను చైనీస్‌ ప్రభుత్వం విడుదల చేయలేదు.

దీంతో ఓ ఖాలీ కుర్చీలో జియాబొ ఫొటోని ఉంచి ఆ బహుమతి మొత్తం నగదును కుర్చీలో ఉంచారు. నూరు సంవత్సరాల నోబెల్‌ చరిత్రలో గ్రహీత లేదా వారి ప్రతినిధి అవార్డును స్వీకరించేందుకు రాలేకపోవడం ఇది రెండవసారి.

మొదటిసారి 1936లో జర్మన్‌ జర్నలిస్ట్‌, శాంతి ప్రచారకుడు కార్ల్‌ వన్‌ ఓసిడ్‌జ్కి నాజీ కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులో చిక్కుకుని ఉండడంవల్ల బహుమతి స్వీకరించేందుకు ఓస్లో రాలేక పోయారు. తాను నివశిస్తున్న దేశ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నిర్బంధాన్ని చవిచూసిన ఒసిడిజ్కి లాగా చైనా నాయకత్వాన్ని నిరసించినందుకు లియు కూడా ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారు.

భారీ డీల్‌కు నో చెప్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్! (Sachin Tendulkar | Master Blaster | Rs20 crore | liqour brand)

FILE
కోట్ల విలువ చేసే భారీ డీల్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నో చెప్పేశాడు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్‌కు ఇచ్చిన మాట కోసం ఓ లిక్కర్ కంపెనీతో భారీ కాంట్రాక్టును వద్దన్నాడు. 

బ్రాండ్ ఏదన్నది కాకుండా.. డీఎల్ ఎంతనే విషయానికే ప్రాధాన్యమిచ్చే చాలామంది ఆటగాళ్ల మధ్య, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 22 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ నాన్నకు ఇచ్చిన మాట కోసం ఆ డీలే వద్దనేశాడు. రికార్డుస్థాయి మొత్తంతో తన కాళ్ల దగ్గరకొచ్చిన భారీ డీల్‌కు మాస్టర్ అంగీకరించలేదు. 

వివరాల్లోకెళితే.. తమ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఉండాలంటూ ఇప్పటిదాకా ఎవరికీ ఇవ్వనంత మొత్తంతో ఏడాదికి రూ. 20 కోట్ల కాంట్రాక్టును మాస్టర్‌కు ఆఫర్ చేసిందట ఓ లిక్కర్ కంపెనీ. 

కానీ యువతపై దుష్ప్రభావం చూపే మద్యం, ధూమపానం వంటి ఉత్పత్తులకు తానెప్పుడూ ప్రతినిధిగా ఉండబోనంటూ గతంలో తన తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి సచిన్ ఆ డీల్‌ను తిరస్కరించాడు.

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో రికార్డుల పంట పండిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సామాజిక న్యాయం కోసం లిక్కర్ కంపెనీతో డీల్‌కు ఒప్పుకోలేదని మాస్టర్ గ్రేట్ అని సన్నిహిత వర్గాలు, అభిమానులు